Search This Blog

5 October 2013

Baboi congress

ఆంధ్ర ప్రదేశ్ విభజన చాలా బాధించింది. చాలా ఘోరం జరిగింది. రాజకీయ క్రీడ లో ఆరితేరిన కాంగ్రెస్ చాకచక్యాన్ని చూస్తుంటే భయమేస్తుంది. వంద సంవత్సరాలకు పైగా అనుభవమున్న పార్టి తన సామర్ధ్యాన్ని చూపించింది . సర్వ సమర్ధులు దుర్మార్గులయితే అంతా అరిష్టమే.
నిజానికి విభజించడం కన్నా కలిపి ఉంచడం వల్ల రాష్ట్ర్రానికి మేలు జరుగుతుందని మీకు అమ్దరికన్న్కా ఎక్కువ తెలుసు.
మీకు నచ్చింది. అంతే ! చేసేసారు .
చేయకూడదు అనుకుంటే ఇంతకన్నా సులువుగా ఆపగలిగి ఉండేవారు.
ఎందుకిలా చేసారు?
మీకు ఎన్నికల్లో గెలవగలిగే రకరకాల పద్దతులు తెలుసుకదా... మేం ఎలాగు ఆపద్దతులు చూసి చూసి " ఇది ఇంతే " అని బాధపడడం కుడా మానివేశాం. అలా గెలిచే పద్దతులేమన్నా చేపట్టలేక పోయారా..?
... ...
బాబోయ్ ... మీ సమర్ధతా నైపుణ్యాలు చూస్తే... భయమేస్తుంది.
రేపటి నుండి చాలా మంది నాయకులు మీ పార్టి ని వదిలేస్తారు, మిమ్మల్ని కడిగేస్తారు, ఆవేశంతో ఊగిపోతారు, మీ పార్టీ కి వ్యతిరేఖంగా పనిచేస్తారు , ప్రజలకు బాసటగా మేమున్నాం అంటారు.
మరికొంతమంది మీరు ఎంత దారుణంగా ప్రవర్తించారో చెబుతూ మిమ్మల్నే చూపిస్తూ మీరే మీరే మీరే దీనికి కారణం అంటారు. మనసులో నవ్వేసుకొంటు ఉంటారు.
మళ్లి ...మీరే కదా ఎన్నికలలో పోటి చేసేది? మీ మీ పార్తిలే కదా పోటి చేసేది.?
మేమేమి చేయగలం? ఒడి పోవడం తప్ప? ఇంకెవరిని ఎన్నుకోగలం మిమ్మల్ని తప్ప?
ఎలక్షన్లయిన వెంటనే మళ్ళి మీ సొంత గూటికి మీ చిలకలోచ్చేస్తాయి.
....
.....
మేమేమి చేయగలం? ఏమి చేయగలం?
..
నవ సీమంద్ర నిర్మాతగా పేరు తెచ్చుకొనే అవకాశం వస్తుందనే ఆనందం ఒకరికి...
మన ముక్క మనకు తెచ్చాను కనుక నాకన్నా మీరెవరిని అందలం ఎక్కిస్తారు' అని సంబర పడిపోయే వారొకరు.
సాధారణ జనానికి ఎవరకి తెలియని ఎన్ని నిజాలు తెలియవు మీకు? రాష్ట్రాన్ని కలిపి ఉంచి వెనుక బడిన ప్రాంతాల్ని ఏరి ఏరి అభివృద్ధి చేయడం మీకు ఇంతకన్నా కష్టమా?
పోనీ , అభివృద్ధి కోసం పోరాటాలు చేయక పోయారా/ ప్యాకేజీలు ఇవ్వక పోయారా?

ఇదంతా మనది అనుకున్నాం ఇన్నాళ్ళు.
పెద్ద పరిశ్రమో మరొకటో విశాఖపట్నంలో వచ్చినా ఒకటే , హైదరాబాదులో వచ్చినా ఒకటే ...అసలు ఎప్పుడు వేరుగా చూడలేదు...
ఒక్కటిగా ఉన్నాం ...
ఒక్కటై నడిచాం....
తెలంగాణా సోదరీ సోదరులారా...
రెచ్చగొట్టబడిన మీ ఆవేశ కావేశాల వల్ల, ఎందరో రాజకీయ నాయకుల అధికార దాహం వల్లా వ్యూహాల వల్ల మనం విడదియబద్దాం సుమ్మీ!
...
( తెలంగాణలో సమైఖ్య భావాన్ని ఆలపించిన ఎందరో మహానుభావులకు వేల వందనాలు. )