Search This Blog

16 October 2013

Article371D -a hurdle in bifurcation of AP


ఆర్టికల్ 371(డి) ని ముట్టుకుంటే కాటేస్తుంది!

ఆర్టికల్ 3 ఆంధ్ర ప్రదేశ్ విషయంలో - ఒక అత్తిపత్తి మొక్క లాంటిది. ముట్టుకుంటే ముడుచుకు పోతుంది. దానికి ఆ లక్షణం ఆర్టికల్ 371-డి వలన వచ్చింది. 371డి - ఆర్టికల్ 3 నెత్తి మీద కూర్చుంది-శివుడి తల మీది పాములా. శివుడాజ్ఞ లేకపోయినా చీమ కుట్టవచ్చు కానీ, 371-డి ని కాదని ఆర్టికల్ 3 ముందుకు కదలదు! కాదని ముట్టుకొంటే, 371-డి బుస్సు మని పడగ విప్పుతుంది. ఇప్పుడీ 371డి - విషయంలో కేంద్రం ఏమి చెయ్యబోతోంది? ఏమి చెయ్య బోతున్నారో తేల్చి చెప్పమని ముఖ్యమంత్రి కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ఆ మేరకు సీయస్ మహంతి కేంద్రానికి లేఖ రాశారు. అటునుంచి ఇంతవరకు ఉలుకూ పలుకూ లేదు!

1973లో రాజ్యాంగానికి చేసిన 32వ సవరణ వలన 371-డి అధికరణ వచ్చింది. జూలై 1974 నుంచి అది అమలులోకి వచ్చింది. 371(1) రద్దు చేసి 371డి అమలులోకి తెచ్చారు. మళ్ళీ దాన్ని మార్చాలన్నా, రద్దు చెయ్యాలన్న - కేవలం - రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే వీలవుతుంది. అందునా, అట్లాంటి మార్పులు చేర్పుల వలన ప్రభావితమయ్యే అసంఖ్యాక ప్రజానీకం వ్యతిరేకించేటప్పుడు - రాజ్యాంగ సవరణ ఆషామాషీగా చెయ్యడానికి వీలు కాదు. రాజ్యాంగ సవరణ అంటే - పార్లమెంటులోని 2/3 వంతు ఆధిక్యం కావాలి. పార్లమెంటు ముగిసిపోతున్న వేళ ఇప్పుడీ రాజ్యాంగ సవరణ సాధ్యమయ్యే పని కాదు!

371డి ఇప్పటికే రాష్ట్రాన్ని 6 జోన్లుగా మార్చింది. అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ 'ఒకే రాష్ట్రం' కాదు. ఇది ఆరు ఉప రాష్ట్రాల సమాఖ్య. అందులో హైదరాబాద్ ఫ్రీ జోన్. అంటే - తెలుగువాళ్ళందరికీ శాశ్వత రాజధాని. ఈ శాశ్వత ఏర్పాటుకు గ్యారంటీ ఇచ్చింది 1956 రాష్ట్రాల ఏర్పాటు చట్టం. కాబట్టి - రాష్ట్ర విభజన అంటే - కేవలం పరిపాలనా పరమైన అంశం కాదు. ఇది ప్రజల హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వమూ అందుకు సాహసించ లేదు, కూడదు!

371డి- ఏమంటోంది: “the provisions of this Article and of any order made by the President thereunder shall have effect notwithstanding anything in any other provision of this Constitution or in any other law for the time being in force.” కాబట్టి ఇతరత్రా చట్టలన్నిటికీ అతీతంగా 371-డి పని చేస్తుంది.

కొంతమంది అంటున్నారు: 371-డి కేవలం తెలంగాణా కోసం పెట్టిన చట్టం కనుక తెలంగాణా వాళ్ళందరూ ఒప్పుకుంటే, దాన్ని పక్కన పెట్టవచ్చని. తెలంగాణా వాళ్ళందరూ - 4 కోట్ల మందీ - సంతకాలు పెట్టినా, దాన్ని పక్కన పెట్టగలరా అన్న విషయం అట్లా ఉంచుదాం. నిజానికి 371డి - కేవలం తెలంగాణా సోదరుల కోసమే చేసిన చట్టం కాదు. అది - రాష్ట్రంలో విద్యా ఉద్యోగ విషయాల విషయంలో ప్రజలందరికీ వర్తించే ఒక ప్రత్యేక ఏర్పాటు! 610 జీవో దాని ఆధారంగానే వచ్చింది. 371-డి - ఇలా మొదలవుతోంది: The President may by order made with respect to the State of Andhra Pradesh provide, having regard to the requirements of the State as a whole, for equitable opportunities and facilities for the people belonging to different parts of the State, in the matter of public employment and in the matter of education, and different provisions may be made for various parts of the State.

ఇప్పుడు - 371డి ని - ఉన్నఫళంగా రద్దు చెయ్యడానికి కూడా కుదరదు! 371డి - ఇచ్చిన హక్కులునిరాకరించడం ప్రభుత్వం ఇష్టారాజ్యం కాదు. ప్రజల వ్యతిరేకత మరచి నిరంకుశంగా వ్యవహరించే బలం లేని అర్భక ప్రభుత్వం ఇది. కాబట్టి ఇది 371-డి ని ముట్టుకోలేదు! దీనిపై అభిప్రాయం చెప్పడానికే ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదు! 371-డి విషయంలో ఏమి చేసేదీ చెప్పడానికి సమయం తీసుకోవచ్చు - కానీ - ఉపేక్షించడానికి వీలు లేని '6 ముళ్ళ బంధం' 371డి! కాబట్టే - ఆర్టికల్ 3 అత్తిపత్తి మొక్క అయ్యింది! ఇందిరాగాంధీ చాలా ముందు చూపుతో - ఈ 'విడిపోని బంధం' వేసిందని కిరణ్ చెప్పింది అందుకే!

Article 371-D is beneficial for the ignored sections of society and and underdeveloped regions. Article 371-D is meant for unity and empowerment of the people. దీనిపై చర్చే లేకుండా, దీని మార్పు లేదా రద్దు వలన వచ్చే ప్రభావాలను పరిగణనలోకి తీసుకోకుండా, అమాంతంగా, ఏకపక్షంగా 371-డి ని తీసి చెత్తబుట్టలో వేసెయ్యడం లేదా పనికిమాలినదిగా మార్చెయ్యడం సాధ్యం కాదు. కోట్లాది ప్రజల తరతరాల హక్కులకు సంబంధించిన ఒక ఏర్పాటును - అమాంతంగా తొలగించి - ఆ ప్రజలను కాశ్మీర్ శరణార్దుల మాదిరిగా మార్చి, మీ చావు మీరు చావండని కుప్ప కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ అక్కుబచ్చి ప్రభుత్వం తరిమేస్తుందా?! Never!
Unlike ·  · Share · 9 hours ago