బదిలీల దరఖాస్తు గడువు 5 రోజులు పొడిగించాలి - యుటియఫ్
ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉపాధ్యాయు బదిలీ దరఖాస్తు గడువు 2015 సెప్టెంబర్ 12 (ఈరోజు)తో ముగుస్తుంది. ఇప్పటికి జిల్లాల్లో ఖాళీ జాబితా సిద్ధంకాలేదు. రేషనలైజేషన్ పూర్తికానందున దరఖాస్తు గడువు 5 రోజు పొడిగించాని ఆంధ్రప్రదేశ్ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటియఫ్) అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి ఒక ప్రకటనలో కోరారు. రేషనలైజేషన్ పూర్తి అయితేనే ఎవరు బదిలీకి దరఖాస్తు చేసుకోవాలో ఉపాధ్యాయులకి తెలుస్తుంది. దరఖాస్తు గడువు ముగుస్తున్న జిల్లాల్లో జాబితా లేనందున ఉపాధ్యాయుల తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ దశలో దరఖాస్తు గడువు పొడిగించి వెంటనే ఖాళీ జాబితా, సర్‌ప్లస్ టీచర్ల జాబితా ప్రకటించేలా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మోడల్ పాఠశాలలుగా గుర్తించిన అన్ని స్కూళ్ళకు 5గురు టీచర్లుండేలా పోస్టులు సర్దుబాటు చేయాలని యుటియఫ్ నాయకులు కోరారు.
ఐ.వెంకటేశ్వరరావు, అధ్యక్షులు
పి.బాబురెడ్డి, ప్రధానకార్యదర్శి