Search This Blog

28 August 2015

Tchrs transfers guidelines


టీచర్ల బదిలీలు- మంత్రి గంటా

  అనేక అంశాలను పరిగణలోనికి తీసుకుని ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా టీచర్ల బదిలీలను కౌన్సిలింగ్ ద్వారా చేపట్టాలని నిర్ణయించాం.  ఈ ప్రక్రియ ఆగష్టు 31 నుండి సెప్టెంబర్ నెల 30వ తేదీతో ముగించేలా షెడ్యూల్ రూపొందించాం. అత్యంత పారదర్శకమైన విధానంలో ఈ కౌన్సిలింగ్ వుంటుంది. తొలిసారి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీలు చేయనున్నాం.
  ప్రభుత్వానికి సంబంధించినంత వరకు విద్యావ్యవస్ధలో సమూలంగా మార్పులు తెస్తున్న తరుణంలో నిజమైన అర్హులకీ ప్రోత్సాహకం అందేలాగా, బాగా పనిచేయని వారికి కనువిప్పుకలిగేలాగా బదిలీల్లో 25% శాతం వెయిటేజ్ ఫర్మామెన్స్ కి ఇవ్వనున్నాం. వచ్చే సంవత్సరం ఇది 50శాతానికి పెంచనున్నాం. ఇప్పటికే రేషనలైజేషన్ పై ఆర్డర్స్ ఇచ్చివున్నాం. టీచర్ – విద్యార్ధి రేషియో సవ్యంగా వుండేలాగా సమూలమైన మార్పువచ్చేలాగా ఈ బదిలీ ప్రక్రియ చేపట్టాం.
బదిలీలకు Criteria :
  ఈ బదిలీల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ కు సంబంధించిన అన్ని క్యాటగిరీల ఉపాధ్యాయులు కవర్ అవుతారు.
Compulsory Transfers
o 1 ఆగష్టు నాటికి 8 సంవత్సరాల సర్వీసు ఒకే ప్రదేశంలో పనిచేసిన టీచర్లు, 5 సంవత్సరాలు పూర్తిచేసిన గ్రేడ్ -2 టీచర్లుకు బదిలీ తప్పనిసరి. అయితే 1ఆగష్టు 2015 నాటికి రిటైర్మెంట్ 2సంవత్సరాల లోపు వున్నవారికి బదిలీ వుండదు. కానీ వ్యక్తిగత రిక్వెస్ట్ లు వున్నట్లయితే పరిశీలించబడతాయి.
o 1 ఆగష్టు 2015 నాటికి 50 సంవత్సరాల లోపు వున్న గ్రేడు- 2 హెడ్ మాస్టార్లు, బాలికల ఉన్నత పాఠశాలల్లో  వుంటే బదిలీ తప్పనిసరి.
Request Transfers
o గ్రేడ్ -2 గెజిటెడ్  హెచ్.ఎం. రెండు సంవత్సరాలు ఒకే స్కూల్లో 1ఆగష్టు 2015కి పూర్తిచేసినట్లయితే బదిలీ ధరఖాస్తు చేసుకోవచ్చు.
o రేషనలైజేషన్ లో బదిలీచేయబడిన టీచర్లు, ట్రాన్స్-ఫర్ కౌన్సిలింగ్ మినిమమ్ పిరియడ్ (2సంవత్సరాలు) లేకపోయినా పార్టిసిపేట్ చేయవచ్చు.
o ఒకే మేనేజ్ మెంట్ క్రింద ఏజెన్సీ నుండి ఏజెన్సీ ఏరియా, ప్లెయిన్ ఏరియా నుండి ప్లెయిన్ ఏరియా కు ఈ బదిలీలు ఎఫెక్ట్ అవుతాయి.
o ఉర్దూ మీడియం స్కూల్స్ లో, ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్ధూ చదివిన గ్రేడ్ -2 హెచ్.ఎంలకు ప్రిపరెన్స్ ఇవ్వబడుతుంది.
పాయింట్ల కేటాయింపు
o ధరఖాస్తు చేసిన ఉపాధ్యాయుడి ప్రస్తుత పనిచేస్తున్న స్కూల్ యొక్క క్యాటగిరి (HRA Based)
Category –I (20% HRA)- సంవత్సరానికి 1 పాయింట్
Category –II (14.5% HRA)- సంవత్సరానికి 2 పాయింట్స్
Category –III (12% HRA) - సంవత్సరానికి 3 పాయింట్స్
Category –IV (12% HRA & PR Engineering Deptt., Norms ప్రకారం రోడ్డు కనెక్టివిటీ లేని ప్రాంతాలు)-  సంవత్సరానికి 5 పాయింట్
ఈ ప్రాంతాలను జిల్లా కలెక్టర్, Superintendent Engineer, PR కలిసి సంప్రదించి ప్రకటిస్తారు.
Performance Related Points
  National, State Governmentల ద్వారా ఆవార్డులు పొందుట. (8 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవాలి). – 5 పాయింట్స్
  చైల్డ్ ఇన్పోడేటా ఆధారంగా ఎన్ రోల్ మెంట్ 10 % నుండి 20 % వరకు గత రెండు సంవత్సరాల్లో పెంపుదల చేయుట. – 2 పాయింట్లు
  పిల్లల అటెండెన్స్ (Average on Year Wise) Above 95% - 2 Points
o 90%- 95% - 1 point
  Catchment Area లో పిల్లలందరు 100% స్కూల్ లో నమోదైనట్లయితే, అలాఅని డిప్యూటి ఇవో/ ఎంఇవో సర్టిఫైచేస్తే – 3 పాయింట్స్
  అన్యూవల్ అస్సెస్ -మెంట్  సర్వే ప్రకారం 3,5,8 తరగతుల్లో A & A+ Categoryల్లో 80శాతానికి పైబడిన ఫలితాలు సాధించిన స్టూడెంట్స్ ఉన్నట్లయితే – 2 పాయింట్స్
70 నుండి 79.99 % (B+ Grade) – 1 Point
  పదవతరగతిలో School Average Results – 95% -100%  - 2 Points
o 90% to 94.99% - 1 Point
వ్యక్తిగత పర్మామెన్స్ పాయింట్లు
  హెడ్ మాస్టార్ సర్టిఫికేట్ ను డిఇవో, ఎంఇవో కౌంటర్ సిగ్నేచర్ ఆధారంగా టీచర్ అటెండెన్స్ గత రెండు సంవత్సరాల్లో 95శాతం పైబడి వున్నట్లయితే – 3 పాయింట్లు.
90శాతం నుండి 94.99 శాతం వరకు – 2 పాయింట్లు
  టీచర్ల యొక్క పిల్లలు ప్రభుత్వ లేదా ఎయిడెడ్ స్కూల్స్ లో చదువుతున్నట్లయితే – 2 పాయింట్లు
  స్కూల్ డెవలప్ మెంట్ కోసం నిధులు లేదా పనులు (3లక్షలకు పైబడి) చేయించిన ఉపాధ్యాయులు – 3 పాయింట్లు
2 నుండి 2.99 లక్షలు -  2 పాయింట్లు
1- 1.99 లక్షలు – 1 పాయింట్
  పదవ తరగతి ఫలితాలలో సంబంధిత సబ్జెక్ట్ లో వందశాతం రిజల్ట్ వుంటే – 3 పాయింట్లు
90 శాతం పైబడిన రిజల్ట్స్  - 2 పాయింట్లు
  జిల్లా, రాష్ర్ట కాంపిటీషన్స్ లో విద్యార్ధులను పాల్గోనేలా చేసిన హెచ్.ఎం మరియు టీచర్ కు – 1 పాయింట్
  నేషనల్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసిన స్కూల్ హెచ్.ఎం మరియు పిఇటీ – 3 పాయింట్లు
o స్టేట్ – 2పాయింట్లు
o జోనల్ / జిల్లా – 1  పాయింట్
  4వ క్యాటగిరీ ( Approaches లేని rent schools) కింద పనిచేస్తున్న పాఠశాల వున్న గ్రామంలోనే  నివాసమున్న టీచర్లకు – 2 పాయింట్లు
  సైన్స్ ఎగ్జిబిషన్స్ కండెక్ట్ చేసిన వారికి – 2 పాయింట్లు
స్పేషల్ పాయింట్లు (Extra)
  రాష్ర్టస్దాయి, జిల్లా స్ధాయిల్లో గుర్తింపు పొందిన యూనియన్ల యొక్క ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ – 10 పాయింట్స్
  గ్రేడ్ -2 మ్యారేజ్ కాని హెచ్.ఎంలు మరియు మ్యారేజా కాని ఫిమేల్ టీచర్లు – 10 పాయింట్స్
  Spouse Case – 10 Points  (8 సంవత్సరాల్లో బార్యాభర్తల్లో ఒక్కసారి ఒకరు మాత్రమే వినియోగించుకునేందుకు)
  NCC Officerగా గత 8 సంవత్సరాల్లో ఒకే స్కూల్లో పనిచేస్తున్న హెచ్.ఎం – 10 పాయింట్లు.
  ఇంగ్లీషు మీడియం స్కూల్స్ లో పనిచేయుటకు కాంపిటెన్సి,ఆసక్తి వున్నవారికి – 5 పాయింట్లు
  క్వాలిఫికేషన్ వుండి, మ్యాధ్స్ పర్మినెంట్ గా బోధించడానికి ముందుకొచ్చే ఫిజికల్ సైన్స్ టీచర్లకు – 5 పాయింట్లు
  రిమోట్ ఏరియా ప్రాంతాల్లో పనిచేయడానికి ముందుకొచ్చే టీచర్లు – 5 పాయింట్లు
  రేషనలైజేషన్ లో ఎఫెక్ట్ అయిన వారు – 10 పాయింట్స్
పాయింట్లు టై  అయినట్లయితే
  సినియారిటీ పరిగణలోనికి తీసుకొనబడుతుంది.
మైనస్ పాయింట్లు
  మేజర్ పెనాల్టీ అవార్డయిన వారికి– మైనస్ 5 పాయింట్లు
  మైనర్ పెనాల్టీ అవార్డయిన వారికి – మైనస్ 3 పాయింట్లు
  పదవ తరగతి పాస్ పర్సంటేజ్ 30శాతం కంటే తక్కువ స్కూల్ మొత్తం అయితే హెచ్.ఎంకు లేదా సంబంధిత సబ్జెక్ట్ టీచర్ కు – మైనస్ 5 పాయింట్లు.

Entitlement points తో సంబంధం లేకుండా preference క్యాటగిరీలు
o 70శాతానికి పైబడిన అంగవైకల్యం కలిగిన వారు మరియు కంటిచూపు లేని వారు
o Widow, Legal గా సపరేట్ అయినవారు.
o Mentally retarded Children or Chronic Medical Diseases
o ఖాళీల నోటిఫై చేసిన తర్వాత సినియారిటీ లిస్ట్ తయారు చేయబడుతుంది. అన్-లైన్ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అబ్జెక్షన్స్ ఏవైనా ఉన్నట్లయితే వాటిని పరిశీలించి, డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపడతాం.
o బదీలలను అప్రూవ్ చేయడానికి ఈ క్రింది కమిటీలను నియమిస్తున్నాం.
SL.No. Cadre Committee
1 గెజిటెడ్ హెచ్.ఎం – Govt. Schools ఒక సినియర్ ఆఫిసర్ from C&DSE
RJD
DEO
2 Gr. II HMs in ZPs ZP Chairman,
Collector / Joint Collector
RJD or His nominee
CEO, ZP
3 Teachers of Govt. Schools Collector / J.C
CEO, ZP
DEO Concerned
4 ZP / MPP Teachers Chairman, ZP
Collector / J.C
CEO, ZP
DEO Concerned

టీచర్ల బదిలీల షెడ్యూల్
Sl.No Subjects Dates
1 Rationalization 31.08.2015 to
04.08.2015
2 Announcement of Vacancies 06.09.2015
3 Online Applications 07.09.2015 to
10.09.2015
4 Applications Verification – Points 07.09.2015
11.09.2015
5 పాయింట్ల కేటాయింపు ప్రకటన 13.09.2015
6 Objections Filing 15.09.2015 & 16.09.2015
7 అభ్యంతరాల పరిశీలన ముగింపు 15.09.2015 & 16.09.2015
8 ధరఖాస్తుల Confirmation 18.09.2015
9 Final Seniority List with Points 19.09.2015
10 Online Web Options by Teachers 21.09.2015 to
24.09.2015
11 Transfer orders & Joining 30.09.2015


  డియస్సీ పై డిపార్ట్ మెంట్ చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయి. బదీలీల కౌన్సిలింగ్ ముగిసేలోగా డియస్సీ ఫైనలైజ్ చేసేవీలుంది. తరువాత డియస్సీలో సెలెక్ట్ అయినవారికి కూడా పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది.
Sent from Samsung Mobile